రంగు పడింది

27 Mar, 2018 22:22 IST|Sakshi

తెల్లగా వెండిలా మెరిసిపోవాల్సిన మంచుకొండలు నారింజ రంగు పులుముకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, బల్గేరియా,రుమేనియాలతోపాటు తూర్పు యూరప్‌ అంతటా ఇదే తీరు!  భూమ్మీద కాకుండా అరుణగ్రహంపై ఉన్నామా? అనేంత నారింజ రంగు! ఎందుకిలా?  పోటెత్తిన పర్యాటకులకు వచ్చినా.. సమాధానం మాత్రం నాసా తీసిన ఫోటోల ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి ఎగసిన ఇసుక గాలులే ఈ మార్పునకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అక్కడి దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు మంచుకొండల్ని చుట్టేయడంతో అవి నారింజ రంగులోకి మారిపోయాయని చెబుతున్నారు. 

యూరప్‌లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. దీంతో పర్వతారోహకులు, మంచులో స్కేటింగ్‌ చేసే వాళ్లు ఈ అరుదైన కొండల్ని చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది సర్వసాధారణమైన విషయమని ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందని చెబుతున్నారు.  ఒక ప్రాంతంలో ఎగిసిపడే దుమ్ము, ధూళి ఇంకో ప్రాంతంలో వాతావరణంపై ప్రభావం చూపించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2007లో దక్షిణ సైబీరియాలోనూ ఇలాగే మంచు ఆరెంజ్‌ రంగులోకి మారిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు