ఐస్లాండ్ అధ్యక్షుడిగా జొహాన్నెసన్

26 Jun, 2016 21:38 IST|Sakshi
ఐస్లాండ్ అధ్యక్షుడిగా జొహాన్నెసన్

రెక్జావిక్: హిస్టరీ ప్రొఫెసర్ జొహాన్నెసన్.. ఐస్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 39.1 శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు. ఐస్లాండ్కు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులకు విదేశాల్లో అవినీతి ఖాతాలు ఉన్నట్లు పనామా పత్రాల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. జొహాన్నెసన్ తన 48వ పుట్టిన రోజునే అధ్యక్షుడిగా ఎన్నికవడం విశేషం.

మరోవైపు స్వతంత్రంగా బరిలోకి దిగిన మహిళా పారిశ్రామికవేత్త హల్లా టొమాస్డొటిర్ 27.9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రచారంలో జొహాన్నెసన్కు గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించిన మాజీ ప్రధాని డేవిడ్ ఆడ్సన్ 13 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. గత రెండు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా ఉన్న ఓల్ఫర్ రాగ్నర్ గ్రిమ్సన్ స్థానంలో జొహాన్నెసన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ద్వీపం జనాభా కేవలం 3.34 లక్షలు కాగా, 10 శాతం మంది యూరో-2016 ఫుట్బాల్ టోర్నమెంట్లో తమ జట్టు ప్రదర్శన చూసేందుకు ఫ్రాన్స్ కు  వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు