మందు ‘వాసన’ పట్టేస్తుంది!

28 Aug, 2016 01:54 IST|Sakshi
మందు ‘వాసన’ పట్టేస్తుంది!

ఫొటోలో కనిపిస్తున్నది ఏదైనా స్మార్ట్ వాచ్ అనుకుంటున్నారా? ఊహూ కానేకాదు. ఇదో వినూత్నమైన పరికరం. ఒళ్లు తెలియకుండా మద్యం తాగేవారికి, దాని పర్యవసానాలు తెలిసినా అలవాటు వదులుకోలేక పోతున్న  వారికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరికరం పేరు ‘స్కిన్’. దీన్ని చేతికి తొడుక్కుంటే చాలు.. మీరు ఎప్పుడు మద్యం తాగినా రక్తంలో ఎంత ఆల్కహాల్ ఉన్నది ఇట్టే చెప్పేయడమే దీని ప్రత్యేకత. మితంగా తాగాలనుకున్న వారికి...

డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి అభాసు పాలు కాకూడదనుకున్న వారికి ఇది బాగా పనికొస్తుందన్న మాట. తాగిన మద్యంలో కొంతభాగం ఇథనాల్ రూపంలో చెమట ద్వారా విడుదల అవుతుంది. ‘స్కిన్’లో ఉండే సెన్సర్ ఈ ఇథనాల్‌ను పసిగట్టి రక్తంలో ఉన్న ఆల్కహాల్ మోతాదును లెక్కిస్తుందన్న మాట. అసలు చిక్కేంటంటే మద్యం సేవించాక కనీసం 45 నిమిషాల తర్వాత గానీ ఇది గుర్తించదు. ఎందుకంటే అప్పుడు కానీ ఇథనాల్ చెమటలోకి చేరదు. చెమటలోకి చేరితే కాని ఇది పనిచేయదు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని బ్యాక్‌ట్రాక్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు