అవి ఆరోగ్యంగా ఉంటే.. మనమూ ఉన్నట్టే!

5 Jul, 2020 08:30 IST|Sakshi

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను నివారించేందుకు మనకున్న మేలైన మార్గం పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటమేనని హెల్త్‌ ఫర్‌ యానిమల్స్‌ అనే సంస్థ చెబుతోంది. ఎందుకంటే కనీసం 13 వ్యాధులు మనుషుల నుంచి జంతువులకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాడిపశువుల రంగానికి ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. పాడి పశువులు, పౌల్ట్రీ, మాంసం కోసం పెంచే మేక, గొర్రె వంటి జంతువులపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. జంతువులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీలు కూడా ఈ సంస్థలో భాగమే. ఏటా కొత్తగా బయటపడుతున్న ఐదు వ్యాధుల్లో మూడు జంతువుల నుంచి సంక్రమించేవే. వ్యాధుల కారణంగా ఏటా కనీసం 20 శాతం పాడిపశువులు మరణిస్తుంటాయని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనీసం వందకోట్ల మందిపై ఉంటుందని ఈ సంస్థ చెబుతోంది.
(చదవండి: భవిష్యత్‌ మహమ్మారి జీ4..!)

గత 12 ఏళ్లలో వ్యాధుల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆరుసార్లు పెద్దసంఖ్యలో పాడిపశువులు మరణించాయని, గాలికుంటు వ్యాధి, స్వైన్‌ఫ్లూ, ఏవియన్‌ బర్డ్‌ ఫ్లూ వంటి వాటి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని ఈ సంస్థ అంచనా. ఈ వ్యాధుల నియంత్రణకు, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు 1995 నుంచి 2008 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యాయి. యాంటీబయాటిక్‌లను అందివ్వడం ద్వారా జంతువ్యాధుల్ని చాలా వరకూ నివారించవచ్చునని తద్వారా వాటిని సంరక్షించుకోవడమే కాకుండా.. వాటిపై ఆధారపడ్డవారి నష్టాలను కూడా తగ్గించవచ్చునని ఈ సంస్థ చెబుతోంది. 
(జూనోసిస్‌ డే...)

మరిన్ని వార్తలు