బాగ్దాదీ చనిపోతే తర్వాత ఎవరు?

24 Jun, 2017 12:00 IST|Sakshi
బాగ్దాదీ చనిపోతే తర్వాత ఎవరు?

బాగ్దాద్‌: ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడి తర్వాత ఆ సంస్థ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. గతంలో ఇరాక్‌ ఆర్మీ అధికారులుగా పనిచేసిన ఇయాద్‌ అల్‌ ఒబైదీ, అయాద్‌ అల్‌ జుమెయిలీ అనే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఈ బాధ్యతలు తీసుకుంటారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ ఇద్దరు కూడా గతంలో సద్దాం హుస్సేన్‌ పరిపాలన హయాంలో ముఖ్యమైన ఆర్మీ అధికారులుగా చేశారంట. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థపై అవగాహన ఉన్న నిపుణులు మాత్రం ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరిని కూడా స్పష్టం చేయలేదు. తాము జరిపిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ బాగ్దాదీ చనిపోయాడని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు