కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సడెన్‌గా అదృశ్యమైతే..

20 Oct, 2017 11:02 IST|Sakshi

న్యూయార్క్‌: ఒకవేళ ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఒక్కసారిగా అదృశ్యమైపోతే.. దాని గురించి మమ్మల్ని అడగొద్దని అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఏఐ) పేర్కొంది. అయినా, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గొప్ప నటుడని, ఒకవైపు అధికారంలో కొనసాగుతూనే.. మరోవైపు సొంతింట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడని వ్యాఖ్యానించింది.

'ఒకవేళ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కనిపించకపోతే.. దాని గురించి నన్ను అడగొద్దు. సీఐఏ చరిత్ర దృష్ట్యా కిమ్‌ అదృశ్యం గురించి నేను మాట్లాడబోను' అని సీఐఏ చీఫ్‌ మైక్‌ పొంపియో పేర్కొన్నారు. ఒకవేళ కిమ్‌ అకస్మాత్తగా చనిపోతే ఏమిటి పరిస్థితి అని ప్రశ్నించగా ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించారు. 'ఇది యాదృశ్చికంగా కొందరు భావిస్తారు. కొందరు ప్రమాదంగా భావిస్తారు. కానీ అది ఫలప్రదం కాదం'టూ ఆయన చేసిన వ్యాఖ్యలతో నవ్వులు పూశాయి. వాషింగ్టన్‌లో సెక్యూరిటీ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వివిధ దేశాల్లో జోక్యం చేసుకోవడం, అక్కడి దేశాధినేతలను అధికారంలోకి దింపేయడం లేదా రుపుమాపడం వంటి క్రూరమైన చీకటి చరిత్ర సీఐఏకు ఉంది. ఇరాన్‌, క్యూబా, కాంగో, వియత్నాం, చిలీ వంటిదేశాల్లో అమెరికా సీఏఐ జోక్యం చేసుకొని.. రాజకీయ సంక్షోభాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను చంపేందుకు దక్షిణ కొరియా నిఘా సంస్థలతో కలిసి అమెరికా సీఐఏ పనిచేస్తోందని ఉత్తర కొరియా ఆరోపించింది. కిమ్‌ ఏకైక లక్ష్యం అధికారంలో కొనసాగడమే అన్న మైక్‌.. సీఐఏ రానున్న రోజుల్లో మరింత క్రూరంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు