‘నేను ఉగ్రవాదిని కాను’

28 Nov, 2017 10:44 IST|Sakshi

న్యూఢిల్లీ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌.. తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని హఫీజ్‌ సయీద్‌ ఐక్యరాజ్యసమితిలో పిటీషన్‌ దాఖలు చేశారు. ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడిగా పేరొందిన హఫీజ్‌ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ పాకిస్తాన్‌లోని ఒక న్యాయవాద సంస్థ ఐక్యరాజ్య సంస్థలో పిటీషన్‌ దాఖలు చేసింది.


ముంబైదాడుల కేసులో కొన్ని నెలలుగా గృహనిర్భంధంలో ఉన్న హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌ కోర్టు ఈ మధ్యే స్వేచ్చను ప్రసాదించింది. ముంబై దాడులు అనంతరం ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సెల్‌ రిజుల్యూషన్‌ 1267 మేరకు హఫీజ్‌ సయీద్‌ అంతర్జాతీయ ఉగ్రవాదిగా సమితి ప్రకటించింది.

మరిన్ని వార్తలు