ఐఎంఎఫ్ ఎండీకి గడ్డు పరిస్థితి

18 Dec, 2015 08:40 IST|Sakshi

పారిస్: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టీన్ లగార్డే విచారణకు హాజరుకావాల్సిందేనని ఫ్రాన్స్ కోర్టు స్పష్టం చేసింది. ప్రజా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే గత కొన్నేళ్లుగా లగార్డేపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆమె ఫ్రాన్స్ ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో బడా వ్యాపార వేత్త బెర్నార్డ్ తైపీకి 2008లో నిధుల విడుదల విషయంలో అవతవకలు చోటుచేసుకున్నాయని, భారీ మొత్తంలో అవినీతి చోటుచేసుకుందనిఆరోపణలు వచ్చాయి.

దీనిపై ప్రారంభంలో విచారణ పేరిట కొంత హడావిడి జరిగినా తన తరుపున న్యాయవాదుల సహాయంతో కొన్ని విచారణలను ఆమె తప్పించుకున్నారు. తనకు ఏమి తెలియనట్లు ఆ విషయం నుంచి పక్కకు జరిగారు. కానీ, తాజాగా తలెత్తుతున్న వివాదం నేపథ్యంలో లగార్డేను విచారణ చేయాలని కోర్టు నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు