పాకిస్తాన్‌కు తగిన శాస్తి

1 Oct, 2016 04:31 IST|Sakshi
పాకిస్తాన్‌కు తగిన శాస్తి

ఎల్‌ఓసీ సర్జికల్ దాడులపై అమర జవాన్ల భార్యలు

 మథుర: నియంత్రణ రేఖ ఆవల ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల పట్ల అమరవీరుల భార్యలు సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు ఈ చర్య తగిన జవాబని అమర జవాను హేమరాజ్ భార్య ధర్మవతి అన్నారు. దాడులు సైనికులు, సామాన్య ప్రజల్లో నమ్మకం కలిగించాయని చెప్పారు. ఇవి ఇంతకు ముందే చేపడితే ఉడీలో 19 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు. పాక్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ఎలాంటి జాలి చూపకూడదని ప్రభుత్వాన్ని కోరారు.

లాన్స్ నాయక్ హేమరాజ్‌ను పాకిస్తాన్ సైన్యం 2013, జనవరి 8న హత్య చేసింది. సర్జికల్ దాడులను ముందే జరిపితే మరింత సంతోషించేదాన్నని మరో అమర వీరుడు సమోద్ కుమార్ భార్య సీమా చౌదరి అన్నారు. ఈమె భర్త గతేడాది అక్టోబర్‌లో జమ్మూలో కన్నుమూశారు. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన జవాన్  సోరన్‌సింగ్ భార్య కమలేశ్ దేవి మాట్లాడుతూ తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జూలైలో అమరుడైన బబ్లూ భార్య రవితా ...ఇలాంటి చర్యలను ఇంతక్రితమే చేపడితే సైన్యం, దేశ పౌరుల ఆత్మస్థైర్యం పెరిగేదని అన్నారు.

మరిన్ని వార్తలు