చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే: సర్వే

24 Jun, 2020 18:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవంతో ప్రజలందరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే పాఠశాల విద్యార్థుల్లో కరోనా ప్రభావం తక్కువేనని ఫ్రెంచ్‌కు చెందిన పాశ్చర్‌ ఇన్సిస్టిట్యూట్ సర్వే తేల్చింది. కాగా పారిస్‌లోని క్రెపి-ఎన్-వలోయిస్ పట్టణంలో 1,340 మంది ప్రజలతో పాశ్చర్‌ ఇన్సిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. అయితే వీరిలో ఆరు ప్రాథమిక పాఠశాలలకు చెందిన 510 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తాజా అధ్యయనంలో 61శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా సంక్రమించినట్లు సర్వే తేల్చింది. మరోవైపు ఆరోగ్యంగా ఉన్న 7శాతం మంది చిన్నారుల తల్లిదండ్రుల్లో వైరస్‌ వ్యాప్తి జరగలేదని, అంటే పెద్దల నుంచే ఎక్కువగా కరోనా సోకుతుందని సర్వే పేర్కొంది.

తాజా సర్వేల నేపథ్యంలో డెన్‌మార్క్‌, స్విట్జర్లాండ్ దేశాలలో పాఠశాలలు(స్కూల్స్‌) ప్రారంభానికి యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి. అయితే వివిధ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, వ్యాధి సంక్రమణ తీవ్రత ఆధారంగా స్కూల్స్‌ ప్రారంభించే విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల ఉదృతి వేగంగా పేరగుతున్నాయి. కాగా వైరస్‌ నియంత్రణలో భాగంగా కరోనా టెస్టులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. (చదవండి: కరోనా : విదేశాల్లో చిక్కుకున్న వారికి ఊరట)

>
మరిన్ని వార్తలు