పాక్‌ పార్లమెంట్‌ అత్యవసర సమావేశం

26 Feb, 2019 15:35 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులపై చర్చించేందుకు పాకిస్తాన్‌ పార్లమెంట్‌ రేపు (బుధవారం) అత్యవసర సమావేశం కానుంది. పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులు సమావేశానికి తప్పక హాజరుకావాలని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదేశాలను జారీచేసినట్లు తెలుస్తోంది. భారత దాడికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న దానిపై పార్లమెంట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఇదిలావుండగా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. వైమానిక దాడులకు సమాధానం ఇవ్వాలని  ప్రతిపక్ష ఎంపీలు ఇమ్రాన్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. (భారత్‌కు సరైన సమాధానమిస్తాం : పాక్‌)

మరోవైపు వాస్తవాదీన రేఖను దాటి భారత విమానాలు నియంత్రరేఖను ఉల్లంఘించాయని పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితి ఆశ్రయించే అవకాశం ఉంది. కాగా భారత మెరుపు దాడులను పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ధ్రువీకరించిన అనంతరం.. ఇమ్రాన్‌ ఖాన్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు