పెప్పర్ స్ప్రేతో చిక్కులు

28 Jan, 2016 14:08 IST|Sakshi
పెప్పర్ స్ప్రేతో చిక్కులు

సండర్ బొర్గ్: ఆత్మరక్షణ కోసం యువతులు, మహిళలు పెప్పర్ స్ప్రే తమ దగ్గర ఉంచుకుంటున్నారు. తమపై దుండగులు దాడి చేసినప్పుడు పెప్పర్ స్ప్రే చల్లి ఆత్మరక్షణ చేసుకుంటున్నారు. అయితే డెన్మార్క్ లో ఓ 17 ఏళ్ల బాలిక పెప్పర్ స్ప్రే కారణంగా చిక్కుల్లో పడింది. పెప్పర్ స్ప్రే కలిగివున్నందుకు జరిమానా ఎదుర్కొబోతోంది.

సండర్ బొర్గ్ ప్రాంతంలో ఈనెల 20న రాత్రి రోడ్డుపై నడిచివెళుతుండగా ఆమెపై ఆగంతకుడొకడు అత్యాచారయత్నం చేశాడు. అతడిపై పెప్పర్ స్ప్రే చల్లి ఆమె బయటపడింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పెప్పర్ స్ప్రే కలిగివున్నందుకు ఆమెకు జరిమానా విధించనున్నారు. డెన్మార్క్ ఆయుధ చట్టం ప్రకారం పెప్పర్ స్ప్రే కలిగివుండడం నేరం. ఆమెకు 5 వేల డానిష్ క్రోన్స్ జరిమానా విధించే అవకాశముందని అధికారులు తెలిపారు. అత్యాచారయత్నంపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
 

మరిన్ని వార్తలు