పిజ్జా పుట్టిన ప్రాంతంలో పొల్యూషన్ రగడ..!

9 Jan, 2016 18:57 IST|Sakshi
పిజ్జా పుట్టిన ప్రాంతంలో పొల్యూషన్ రగడ..!

నేను యాంటీ పిజ్జా మేయర్ని అంటున్నాడు... ఇటలీ శాన్ విటలియానో లో సివిక్ లీడర్ గా మారిన ఓ డాక్టర్. ప్రజారోగ్యమే తనకు ముఖ్యమని, అందుకు తనవంతు ప్రయత్నాన్ని ప్రారంభించానని చెప్తున్నాడు. నీపోలిటన్ హింటర్ ల్యాండ్ లోని ఓ చిన్న పట్టణానికి మేయర్ అయిన ఆయన.. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. అందుకు టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్ కలిగించే కట్టెల పొయ్యిల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడ జారీ చేశాడు. అయితే పిజ్జా పుట్టిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో కట్టెల పొయ్యిల నిషేధం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

కట్టెల పొయ్యిలను వాడే కుటుంబాలు, పిజ్జాలు తయారు చేసే బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారస్తులు ఇప్పుడు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడ వెల్లువెత్తాయి.  అయితే చైనా రాజధాని నగరమైన బీజింగ్ లో ఇప్పటికే  కాలుష్య పొగమంచుపై రెడ్ అలర్ట్ ప్రకటించారని, ముందు జాగ్రత్త చర్యగానే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ చెప్తున్నారు. వాయుకాలుష్యంపై అత్యవసర చర్యలు చేపట్టడంలో భాగంగా... చట్ట పరిమితులు దాటి కాలుష్యాన్నిసృష్టించడాన్ని ఫాల్కోన్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ఇప్పటికే ఒక్కోరూ ఒక్కో పద్ధతిని అమల్లోకి తెస్తూనే ఉన్నారు.  రోమ్  'ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్' ను ప్రవేశ పెట్టగా... మిలాన్ వారంలో మూడు రోజులపాటు వాహనాల వాడకాన్నేనిషేధించింది.  తమవంతు బాధ్యతగా మిలాన్ తో పాటు చాలా నగరాలు న్యూ ఇయర్ వేడుకల్లో టపాసుల వినియోగాన్ని కూడ నిషేధించాయి.

అయితే వాయు కాలుష్యంలో యూరప్ లోనే ఇటలీ.. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని  పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇటలీలో సంవత్సరానికి సుమారు 30 వేలమంది దాకా  కాలుష్యంతో మరణిస్తున్నట్లు  2015 ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో పెరిగే కాలుష్యాన్నినిషేధించేందుకు పురపాలక సంఘాలు కాలుష్య మూలాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. జాతీయ వాతావరణ శాఖామంత్రి పర్యావరణంపై పురపాలక సంఘాల ప్రతినిధులతో రోమ్ లో అత్యవసర సమావేశం కూడ నిర్వహించారు. ఇళ్ళలో, కార్యాలయాల్లో థర్మోస్టాట్ల వాడకాన్నినిషేధించారు. నగరాల్లో స్పీడ్ లిమిట్ ను అమల్లోకి తెచ్చారు. పాత కార్ల వాడకానికి స్వస్తి పలికి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని ఆదేశించారు. పొగ గొట్టాల వాడకంపై కూడ పరిమితులు విధించారు.

అయితే చట్టాలు, నిషేధాలతో  పొల్యూషన్ ను నియంత్రించడాన్ని అమలు చేస్తున్న లక్షల ప్రాంతాల్లో ఇటలీ ఒకటి. పొల్యూషన్ సమూలంగా నిర్మూలించాలంటే ఇటువంటి బాధ్యతను సక్రమంగా అమలు చేయడం  ఫాల్కోన్ వంటి  ప్రతి మేయర్ పైనా ఉంది.  ఈ నేపథ్యంలో స్థానిక  పిజ్జా విక్రయదారులు, వ్యాపారస్తులు ఫిబ్రవరి 29 నాటికి ఓవెన్లకు తగిన పొల్యూషన్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచి ఇనస్పెక్లర్లు తనిఖీలు ప్రారంభిస్తారని, ఫిల్టర్లు లేని రెస్టారెంట్లు, పిజ్జా తయారీదారుల లైసెన్సులు రద్దు చేస్తారని హెచ్చరించారు. కాగా ప్రాణాంతకమైన పొల్యూషన్ నియంత్రణపై అవగాహన అనంతరం పిజ్జా విక్రయదారులు కూడ మేయర్ కు సహకరించేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. అయితే ఇటువంటి పెద్ద సమస్యను మిణుగురు పురుగువంటి తమ చిన్న పట్టణంలో అమలు చేస్తే సరిపోదని, మిగిలిన నగరాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు