దోవల్‌ వల్లే డోక్లామ్‌ ఉద్రిక్తత: చైనా

26 Jul, 2017 03:00 IST|Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులోని డోక్లామ్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ వల్లే ఉద్రిక్తత నెలకొందని చైనా అధికార మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ మంగళవారం ఆరోపించింది. గురువారం నుంచి జరిగే బ్రిక్స్‌ దేశాల జా తీయ భద్రతా సలహాదారుల(ఎన్‌ఎస్‌ఏ) సమావేశం కోసం బీజింగ్‌కు వెళ్తున్న దోవ ల్‌.. సరిహద్దు వివాదంపై చైనా ఎన్‌ఎస్‌ఏ తో చర్చించే అవకాశమున్న నేపథ్యంలో ఈ విమర్శలు చేయడం గమనార్హం.

చైనాతో ముప్పు: ఆర్మీ వైస్‌ చీఫ్‌
భారత పొరుగు ప్రాంతాల్లోని హిమాలయాల వెంబడి చైనా ప్రభావం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో మనకు ముప్పుగా మారొచ్చని ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ శరత్‌ చంద్‌ చెప్పారు. చైనా తన భద్రతపై చేస్తున్న ఖర్చులో చాలా భాగాన్ని బహిర్గతం చేయడం లేదని అన్నారు.ఈ పరిస్థితుల్లో భారత్‌ తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలన్నారు.
 

>
మరిన్ని వార్తలు