పదిదేశాల్లో అంటు వ్యాధిలా హెచ్‌ఐవీ

21 Jul, 2017 14:31 IST|Sakshi
పదిదేశాల్లో అంటు వ్యాధిలా హెచ్‌ఐవీ
హైదరాబాద్‌: భారత్‌, చైనాతో పాటు పది దేశాల్లో హెచ్‌ఐవీ అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతుందని ఐకరాజ్య సమితి(యూఎన్) తమ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నిర్మూలనుకు చెపట్టిన కార్యక్రమాలపై జరిపిన విశ్లేషణ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌, చైనాతోపాటు, ఇండోనేషియా, పాకిస్థాన్‌, వియాత్నం, మయన్మార్‌, పాపువా న్యూ గినియా, ఫిలిప్పిన్స్‌, తైలాండ్‌, మలేసియాలో హెచ్‌ఐవీ అంటువ్యాధిలా ప్రబలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
 
ప్రపంచ వ్యాప్తంగా  కొత్తగా హెచ్‌ఐవీ సోకిన బాధితుల్లో 95 శాతం ఈ పదిదేశాలకు చెందిన వారేనని పేర్కొంది. దీనికి  సెక్సు వర్కర్లు, ట్రాన్స్‌జెండర్స్‌లతో లైంగిక చర్యలకు పాల్పడటం, ఇంజక్షన్స్‌ తో డ్రగ్స్‌ తీసుకోవడమే ప్రధాన కారణంగా తెలిపింది. అయితే గత ఆరు సంవత్సరాల నుంచి హెచ్‌ఐవీ భారిన పడే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 13 శాతం తగ్గిందని పేర్కొంది. భారత్‌లోని 26 నగరాల్లో జరిపిన సర్వేలో 46 శాతం మంది డ్రగ్స్‌ ఇంజెక్ట్‌ చెసుకోవడం వల్లే హెచ్‌ఐవీ బాధితులుగా మారారని పేర్కొంది. గతంతో పోలిస్తే ఎయిడ్స్ బాధితుల మరణాలు తగ్గినట్లు తమ సర్వేలో వెల్లైడందని యూఎన్ రిపోర్టులో పేర్కొంది.
మరిన్ని వార్తలు