భారత్‌కు మద్దతుగా అమెరికన్ కాంగ్రెస్‌లో తీర్మానం

17 Jun, 2016 03:01 IST|Sakshi

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న భారత్ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ అమెరికన్ కాంగ్రెస్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం ప్రతినిధుల సభలో కాంగ్రెస్ సభ్యులు ఫ్రాంక్ పాలన్, సభలో ఉన్న ఏకైక ఇండియన్ అమెరికన్ అమి బెరా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా ప్రభుత్వం మద్దతిచ్చిన ఏకైక దేశం భారత్ మాత్రమే. ‘భారత్ భద్రతా మండలిలో ఉంటే సానుకూల ప్రభావం ఉంటుంది. భారత ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నాను’  పాలన్  పేర్కొన్నారు.
 
సైనిక ఒప్పందానికి సెనేట్ ఆమోదం

భారత్‌తో సైనిక సహకారం పెంపొందించుకోవడానికి అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత్‌తో సైనిక బలగాల మార్పిడికి సంబంధించి ప్రవేశపెట్టిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డీఏఏ)-2017 చట్ట సవరణకు సెనేట్ ఆమోదించింది.

మరిన్ని వార్తలు