న్యూక్లియర్ సప్లయర్ గ్రూపులో భారత్?

15 May, 2015 14:37 IST|Sakshi

బీజింగ్:   అణు సరఫరాదారుల (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ) బృందంలో భారత్కు సభ్యత్వం అంశం గురించి భారత్- చైనాల మధ్య మొదటి సారి చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్  మీడియాకు వివరించారు. మోదీ పర్యటన వివరాలను ఆయన తెలిపారు. చైనా ప్రధాని జిన్ పింగ్ సమావేశ వివరాలు, 24 ఒప్పందాలపై సంతకాలు తదితర విషయాలను విలేకర్లకు తెలిపారు.


పాకిస్థాన్లో  పెట్రేగుతున్నఉగ్రవాదం, ఉగ్రవాదంపై ఇరుదేశాల పోరు, ఐరాస  భద్రతా మండలిలో  చేపట్టాల్సిన  సంస్కరణలు చర్చకు వచ్చాయన్నారు. గుజరాత్లో మోదీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి నమూనాను చైనాలో అమలు చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని  ఆ దేశ ప్రధాని చెప్పారని తెలిపారు. అలాగే నేపాల్ భూకంప తదనంతర పరిస్థితులపై కూడా చర్చించారన్నారు. ఇరు ప్రధానుల భేటీ తర్వాత నరేంద్ర మోదీ ప్రసంగ వివరాలను తెలుపుతూ భారత్ - చైనా సరిహద్దులో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారన్నారు.


కాగా అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల పట్ల అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించిన ప్రధానమంత్రి .. 'భారత్లో కాలుష్యం పెరిగిపోతోందని వివిధ దేశాల ఏజెన్సీలు లెక్కలతో సహా మనల్ని నిందిస్తాయి.. కానీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్ని కడతామంటే మాత్రం గగ్గోలు పెడతాయి. దయచేసి మాకు అనుమతులు మంజూరుచేయండి' అని గ్లోబర్ న్యూక్లియర్ కమిటీని మోదీ గతంలో విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు