'మా వ్యూహం విజయానికి కారణం ఇండియానే'

2 Feb, 2018 11:55 IST|Sakshi

వాషింగ్టన్‌ : భారత్‌పై అమెరికా మరోసారి ప్రశంసలు కురిపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌ చేస్తున్న కృషి చాలా గొప్పదని పేర్కొంది. తమ దక్షిణాసియా వ్యూహంలో భారత్‌దే కీలక పాత్ర అని వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్‌ పాత్ర ఏ మేరకు ఉందని భావిస్తున్నారని పెంటగాన్‌ చీఫ్‌ అధికారిక ప్రతినిధి దానా వైట్‌ను ప్రశ్నించగా ఆమె పై విధంగా స్పందించారు.

'భిన్న విధాలుగా ఉపయోగించుకునేలా భారత్‌తో మాకు అనుబంధాలు ఉన్నాయి. చాలా హుందాగా దక్షిణాసియా వ్యూహానికి భారత్‌ సహాయం చేస్తోంది. దీని అభివృద్ధి కోసం గొప్ప నిధిని కేటాయించింది. ఏవియేషన్‌ మెయింటెన్స్‌ విషయంలో కూడా భారత్‌ అద్భుతంగా సాయం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ఎలాన్ని నిర్మూలించాలనే విషయంలో భారత్‌నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భాగస్వామ్యులను భారత్‌ ఏకం చేస్తున్న తీరునే తాము కొనసాగిస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఈ రోజు మా దక్షిణాసియా స్ట్రాటజీ విజయవంతంగా అమలవుతుందంటే దానికి కారణం భారతే' అని ఆమె పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: మృత్యుఘంటికలు

కరోనా: తప్పిన పెనుముప్పు!

ట్రంప్‌కు హెచ్‌-1బీ వీసా ఉద్యోగుల అభ్యర్థన?

కరోనా: న్యూయార్క్‌ గవర్నర్‌ భావోద్వేగం

కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌