బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భేష్‌

23 Sep, 2018 05:14 IST|Sakshi

వాషింగ్టన్‌: బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో భారత్‌ గతేడాది గణనీయమైన పురోగతి సాధించిందని అమెరికా అధికార నివేదిక ఒకటి వెల్లడించింది. 2017లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పురోగతి సాధించిన 14 దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. అమెరికా కార్మిక శాఖ శనివారం విడుదల చేసిన ‘చైల్డ్‌ లేబర్‌ అండ్‌ ఫోర్స్‌డ్‌ లేబర్‌’వార్షిక నివేదికలో ఈ వివరాలున్నాయి. బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు ప్రపంచంలోని 132 దేశాలు తీసుకుంటున్న చర్యలను కచ్చితంగా అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది మరింత కఠిన ప్రమాణాలను వాడినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం కొలంబియా, పరాగ్వే, భారత్‌సహా 14 దేశాలే ఈ ప్రమాణాలను అందుకున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం బాల కార్మిక చట్టంలో చేసిన సవరణలతోపాటు చట్టాన్ని సరిగ్గా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు