చైనా ఆఫర్.. ఇండియా ఔట్​..!

14 Jul, 2020 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చాబహార్ పోర్టు నుంచి జహేదాన్​ వరకూ భారత్​ నిర్మించాల్సిన రైలు మార్గాన్ని తమ సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్​ పేర్కొంది. నిధులివ్వడంలో భారత్ జాప్యం చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. (చూస్తుండగానే నదిలోకి జారిన స్కూల్‌ బిల్డింగ్‌)

దాదాపు నాలుగేళ్ల క్రితం చాబహార్–జహేదాన్​ మధ్య రైలు మార్గం వేయడానికి ఇరాన్​, భారత్​ మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 3,015 కోట్ల రూపాయల వ్యయంతో 2022 నాటికి భారత్​ ఈ మార్గాన్ని నిర్మించాలి. ఆసాంతం అప్ఘానిస్థాన్​ బోర్డర్​ను ఆనుకుంటూ వెళ్లే 628 కిలోమీటర్ల ఈ రైలు మార్గం అత్యంత కీలకమైనది.(అది పూర్తిగా అసత్యపు వార్త : ప్రియాంక గాంధీ)

భవిష్యత్​లో ఈ మార్గాన్ని జరంజ్​కు విస్తరిస్తామని ఇరాన్​ రవాణా మంత్రి రైలు మార్గ శంకుస్థాపన సందర్భంగా మహమ్మద్​ ఇస్లామీ పేర్కొన్నారు. 

చైనాతో భారీ ఒప్పందం
ఇరాన్​, చైనా మధ్య 30 లక్షల కోట్ల రూపాయల ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. దీని ప్రకారం వచ్చే 25 ఏళ్లలో ఈ మొత్తాన్ని ఇరాన్​​లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు చైనా ఖర్చు చేస్తుంది. చైనా రాకతోనే ఇరాన్​, ఇండియాను పక్కనబెట్టిందనే రిపోర్టులూ వస్తున్నాయి.

ఇరాన్, చైనా ఒప్పందం కుదిరితే డ్రాగన్​ దేశం చాబహార్ పోర్టు​ను ఎలాంటి పన్నులు కట్టకుండా వాడుకోవచ్చు. పోర్టుకు దగ్గర్లోని ఓ ఆయిల్​ రిఫైనరీ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన తదితరాలకు చైనా సహకరిస్తుంది. చాబహార్​ పోర్టు నిర్మాణంలోనూ చైనా కీలకపాత్ర పోషించనుందని సమాచారం. అంతేకాకుండా ఈ పాతికేళ్లలో చైనాకు ఇరాన్​ క్రమం తప్పకుండా ఆయిల్​, గ్యాస్​ను సరఫరా చేయాలి.

చాబహార్​ పోర్టు అభివృద్ధి బాధ్యతలను ఇరాన్​ చాలా రోజుల క్రితమే ఇండియాకు అప్పజెప్పింది. చైనా చాబహార్​ను అభివృద్ధి చేస్తుందని వస్తున్న రిపోర్టులను ఇరాన్​ అధికారులు ఖండించారు.

ఇండియాకు పెద్ద నష్టం
చాబహార్​ రైల్వే ప్రాజెక్టును కోల్పోవడం భారత్​కు దౌత్యపరంగా పెద్ద దెబ్బని కాంగ్రెస్​ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దౌత్యం పరంగా ఒక్క పనీ సరిగా చేయలేదని విమర్శించింది. ఇంత చేసిన వాళ్లను ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు అంటూ కాంగ్రెస్​ నేత అభిషేక్ మనుసింఘ్వీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
 

మరిన్ని వార్తలు