కెనడా వీసాపై ఆందోళన

5 Mar, 2017 01:56 IST|Sakshi
కెనడా వీసాపై ఆందోళన

న్యూఢిల్లీ: తాత్కాలిక విదేశీ కార్మికులకు సంబంధించిన వీసా కార్యక్రమంలో కెనడా మార్పులు చేయడం పట్ల భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత కంపెనీలు తమ ఉద్యోగులను స్వల్పకాల వీసాలపై ఆ దేశానికి పంపడం కష్టమవడంతో పాటు సేవారంగంపై ప్రభావం పడుతుంది.

భారత పర్యటనలో ఉన్న కెనడా అధికారుల దృష్టికి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్  ఈ విషయాన్ని తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.  నిర్మలా సీతారామన్ , కెనడా విదేశీ వాణిజ్య మంత్రి ఫ్రానోయిస్‌ ఫిలిప్పె చాంపేన్  మధ్య జరిగిన చర్చల్లో ఇది ప్రస్తావనకు వచ్చింది.

మరిన్ని వార్తలు