‘భారత్‌పై పాక్‌ విద్వేష విషం’

23 Jan, 2020 11:05 IST|Sakshi

న్యూయార్క్‌ : జమ్ము కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తోందని భారత్‌ మండిపడింది. భారత్‌పై పాక్‌ విద్వేష విషం చిమ్ముతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి నాగరాజ్‌ నాయుడు దుయ్యబట్టారు. ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ ప్రతినిధులు మాట్లాడిన ప్రతిసారీ భారత ప్రభుత్వంపై దుష్ర్పచారం సాగిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేప నీటిలో ఎలాగైతే మునుగుతుందో పాకిస్తాన్‌ ప్రతినిధులు సైతం ప్రతి సందర్భంలో భారత్‌పై విద్వేష విషం చిమ్ముతున్నారని అన్నారు.

భారత్‌ పట్ల శత్రు వైఖరిని వీడి సాధారణ సంబంధాలు ఏర్పరచుకునేందుకు పాకిస్తాన్‌ చేస్తున్నదేమీ లేదని మండిపడ్డారు. అసత్యాలు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ సమాజం ఎదుట భారత్‌ను పలుచన చేయాలని పాక్‌ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. పాక్‌ దుష్ర్పచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరిచి దౌత్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు చొరవ చూపాల్సిన సమయం ఇదేనని చెప్పుకొచ్చారు.

చదవండి : ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు

మరిన్ని వార్తలు