పాల ఉత్పత్తిలో భారత్‌ నెం1

11 Jul, 2017 12:09 IST|Sakshi
పాల ఉత్పత్తిలో భారత్‌ నెం1

హైదరాబాద్: వచ్చే పదేళ్లలో భారత్‌ పాల ఉత్పత్తిలో నెం1గా నిలవనుంది. దీనికి కారణం జనభా పెరుగదలేనని ఐక్యరాజ్య సమితి, ఎకనామిక్ కోఆపరేషన్ సంస్థ(ఓఈసీడీ) రూపోందించిన (2017-2026) వ్యవసాయ అవుట్‌లుక్‌  రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తి మూడు రెట్లు అవుతుందని, భారత్‌ తర్వాత యూరోపియన్‌ యూనియన్‌ స్థానంలో నిలుస్తుందని రిపోర్టులో సూచించారు. అంతేకాకుండా జనాభాలో చైనాను మించి అత్యధిక జనాభ గల దేశంగా భారత్‌ నిలుస్తుందని తెలిపారు. భారత్‌ ప్రస్తుత జనాభ 130 కోట్లు ఉండగా ఈ సంఖ్య 150 కోట్లకు చేరుతుందని ఓఈసీడీ అంచనా వేసింది. 

ఇక గోధుమల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం పెరగగా.. కేవలం ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో 49 శాతం పెరుగుతోందని పేర్కొంది. భారత్‌, పాక్‌, చైనాలో గోధుమల ఉత్పత్తి ఎక్కువగా ఉండబోతుందని ఓఈసీడీ నివేదిక స్పష్టం చేసింది. ఇక రైస్‌ ప్రపంచ వ్యాప్తంగా 12 శాతం పెరగుతోందని, భారత్‌, ఇండోనేషియా, మయన్నార్‌, తైలాండ్‌, వియత్నంలో ఎక్కువ ఉత్పత్తి ఉంటుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు