ఐసీజే జడ్జి ఎంపికలో ప్రతిష్టంభన

15 Nov, 2017 01:41 IST|Sakshi

ఐరాస సాధారణ సభలో భారత్‌కు అసాధారణ మద్దతు

బ్రిటన్‌కు బాసటగా మండలి శాశ్వత సభ్యులు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో జడ్జి ఎంపికలో పోటీలో ఉన్న భారత్‌కు చెందిన దల్వీర్‌ భండారీకి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సభ్యుల నుంచి అసా దారణ మద్దతు లభించింది. అయితే భద్రతా మండలి శాశ్వత సభ్యులు మాత్రం ఇదే స్థానానికి పోటీ పడుతున్న బ్రిటన్‌కు చెందిన క్రిస్టొఫర్‌ గ్రీన్‌వుడ్‌కు మద్దతు తెలిపారు. దీంతో ఇద్దరిలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో జడ్జి ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో తిరిగి ఎన్నికలు నిర్వహిం చాలని భండారీ, గ్రీన్‌వుడ్‌ కోరుతున్నారు.

15 మంది సభ్యులున్న ఐసీజేలో మూడేళ్లకోసారి మూడోవంతు సభ్యులు రిటైరవుతారు. దీంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహి స్తారు. ఖాళీ అయిన 5 స్థానాలకు ఆరుగురు పోటీపడగా నలుగురు ఎంపికయ్యారు. మిగి లిన స్థానానికి భండారీకి, గ్రీన్‌వుడ్‌కు మధ్య పోటీ ఉంది. వీరిలో ఒకరిని ఎన్నుకునేందుకు సోమవారం సాధారణ సభ, భద్రతా మండలి వేర్వేరుగా సమావేశమయ్యాయి.

భద్రతా మండలిలో జరిగిన ఐదు రౌండ్ల ఎన్నికల్లో ప్రతీ రౌండ్‌లో గ్రీన్‌వుడ్‌ 9 ఓట్లు పొందగా, భండారీకి మాత్రం ఐదు ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే కచ్చితంగా 8 ఓట్లు సాధించాలి. దీన్నిబట్టి గ్రీన్‌వుడ్‌ పైచేయి సాధించినట్లే. అయితే ఇందుకు భిన్నంగా సాధారణ సభలో జరిగిన 5 రౌండ్ల ఎన్నికల్లో భండారీ అసాధారణ మెజార్టీ సాధించారు. ఈ సభలో 97 ఓట్లు సాధించా ల్సి ఉండగా.. గురువారం జరిగిన ఎన్నికలో 115 ఓట్లు భండారీ సాధించగా.. సోమవారం ఎన్నికలో121 ఓట్లు సాధించారు. గ్రీన్‌వుడ్‌కు మాత్రం వరుసగా 76, 68 ఓట్లే వచ్చాయి.  

>
మరిన్ని వార్తలు