-

బ్రేకింగ్‌ : ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

19 Aug, 2018 20:09 IST|Sakshi

జకర్తా : ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలిరోజు శుభారంభం లభించింది. రెజ్లింగ్‌ విభాగంలో భజరంగ్‌ పునియా భారత్‌కు తొలి స్వర్ణం అందించారు. పురుషుల 65 కేజీల రెజ్లింగ్‌ విభాగంలో జపాన్‌కు చెందిన తకటాను ఓడించి భజరంగ్‌  సత్తా చాటాడు. ఫైనల్‌లో తకాటాపై 11-8 తేడాతో పునియా విజయం సాధించి ఆసియా క్రీడాల్లో తొలి స్వర్ణ పతాకం పొందారు. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బచూలున్‌పై 10-0తో సంచలన విజయాన్ని నమోదు చేశారు. క్వార్టర్స్‌లో ఫైజీవ్‌ అబ్దుల్‌ ఖాసీమ్‌పై 12-2తో పునియా అద్భుత విజయాన్ని సాధించారు.

కాగా ‍ఆసియా క్రీడల్లో పునియాకు ఇదే తొలి స్వర్ణ పతాకం కావడం విశేషం. 2014లో జరిగిన క్రీడల్లో పునియా రజత పతాకం పొందిన విషయం తెలిసందే. కాగా రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో పునియా ఒక్కడే రాణించాగా, మిగతా ఆటగాళ్లు అందరూ తీవ్రంగా నిరూత్సహాపరిచారు.

మరిన్ని వార్తలు