డబ్బు కోసం భారత బిలియనీర్‌ ఏం చేశాడంటే...

27 Oct, 2017 12:34 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత అమెరకన్‌ ఫార్మా బిలియనీర్‌ జాన్‌ నాథ్‌ కపూర్‌ (74)ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. క్యాన్సర్‌ రోగులకు వాడే నొప్పి నివారణ ఓపియడ్‌ను ప్రిస్కైబ్‌ చేయాలని డాక్టర్లకు ముడుపులు ముట్టచెప్పడం,కుట్ర అభియోగాలను కపూర్‌పై నమోదు చేశారు. అమృత్‌సర్‌లో జన్మించిన కపూర్‌ 1960లో భారత్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆయన ప్రస్తుతం ఫార్మా కంపెనీ ఇన్సిస్‌ థెరాప్యుటిక్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

గత ఏడాది 20,000 మంది పైగా అమెరికన్లు ఒపియడ్‌ ఓవర్‌డోస్‌లు తీసుకోవడం వల్ల మరణించడంతో కపూర్‌ నిర్వాకంపై అమెరికా అధికారులు సీరియస్‌గా ఉన్నారు. లక్షలాది అమెరికన్లు ఈ ప్రమాదకర డ్రగ్‌కు అడిక్ట్‌ అయ్యారు. దీనికి బాధ్యులైన వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని యూఎస్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది.

ఒపియడ్‌ విక్రయాలపై యూఎస్‌ ఉక్కుపాదం మోపడంతో కపూర్‌ బృందం వైద్యులకు లంచాలు ఆఫర్‌ చేసి ఈ డ్రగ్‌ను ప్రిస్కైబ్‌ చేసేలా వ్యవహరించింది. లాభాల కోసం బీమా కంపెనీలనూ రీఎంబర్స్‌మెంట్‌ వచ్చేలా వీరు ఒత్తిడి తీసుకువచ్చినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం నీచానికి ఒడిగట్టే ఈ ఇండియన్‌ అమెరికన్‌ న్యూయార్స్‌ స్టేట్‌ యూనివర్సిటీ నుంచి మెడిసినల్‌ కెమిస్ర్టీలో పీహెచ్‌డీ పొందాడు. బాంబే వర్సిటీ నుంచి ఫార్మసీలో బీఎస్‌ చేశాడు.

మరిన్ని వార్తలు