‘భారతీయ’ కంపెనీపై అమెరికాలో జరిమానా

3 May, 2018 05:01 IST|Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత సంతతి వ్యక్తికి చెందిన ఓ కంపెనీపై అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ జరిమానా పడింది. హెచ్‌–1బీ వీసాపై 12 మంది విదేశీ ఉద్యోగులను నియమించుకున్న క్లౌడ్‌విక్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీ వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా అతి తక్కువ వేతనాలను చెల్లించింది. ఈ కంపెనీ బాధిత ఉద్యోగుల్లో భారతీయులే అధికంగా ఉన్నారు.

నెలకు 8,300 డాలర్ల వేతనం ఇస్తామని చెప్పి హెచ్‌–1బీ వీసాపై ఉద్యోగులను రప్పించుకున్న కంపెనీ.. కొందరికి మరీ తక్కువగా నెలకు 800 డాలర్ల వేతనాన్ని మాత్రమే ఇచ్చిందని అమెరికా కార్మిక శాఖ గుర్తించింది. దీంతో 1,73,044 డాలర్ల జరిమానాను కంపెనీపై విధించి ఆ మొత్తాన్ని ఇప్పటిదాకా తక్కువ వేతనాలు అందుకున్న ఉద్యోగులకు అందజేయాలని కార్మిక శాఖ ఆదేశించింది. 

మరిన్ని వార్తలు