సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం

16 Jun, 2020 05:19 IST|Sakshi
భారతీయ అమెరికన్ ‌ క్షమా సావంత్‌

వాషింగ్టన్‌/లండన్‌: అమెరికాలో మరోసారి జాతివివక్షకు నిరసగా ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో చివరకు ఇద్దరు నల్లజాతీయులు జార్జ్‌ ఫ్లాయిడ్, రేషార్డ్‌ బ్రూక్స్‌ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో నిరసనలు ఎక్కువయ్యాయి. సియాటిల్‌లో జరుగుతున్న ‘బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్‌’ ఆందోళనలకు 46 ఏళ్ల భారతీయ అమెరికన్‌ క్షమా సావంత్‌ నేతృత్వం వహిస్తున్నారు. సియాటెల్‌ డౌన్‌టౌన్‌ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్‌పై ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణేలో పుట్టి ముంబైలో చదువుకున్న క్షమా సావంత్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను గమనించిన తాను ఆర్థిక శాస్త్రాన్ని చదివానని అందులోనే పీహెచ్‌డీ చేశానని ఆమె  తెలిపారు. 2006లో సోషలిస్ట్‌ ఆల్టర్నేటివ్‌లో చేరి 2013లో సిటీ కౌన్సిల్‌ ఉమెన్‌గా ఎన్నికయ్యారు.

బ్రిటన్‌లో జాతివివక్షపై కమిషన్‌..
బ్రిటన్‌లో జాతివివక్ష సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌  ప్రకటించారు. జాతివివక్షకు ఫుల్‌స్టాప్‌ పెట్టే విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు..  


జార్జి ఫ్లాయిడ్‌ హత్యను నిరసిస్తూ అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లోని హాలీవుడ్‌లో ‘ఆల్‌ బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులు

మరిన్ని వార్తలు