అలనాటి కాన్పూర్ విద్యార్థికి ఒబామా సన్మానం

20 May, 2016 09:48 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి భారతీయ సంతతి పౌరుడికి గుర్తింపును ఇచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన రాకేష్ కే జైన్ (65)ను ఒబామా సైన్స్ మెడల్ తో సత్కరించారు. మరో పాక్ సంతతి పౌరుడికి కూడా ఒబామా ఈ సన్మానం చేశారు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ ఆస్పత్రిలో రాకేష్ విశేష సేవలు అందిస్తున్నారు.

అంతేకాకుండా క్యాన్సర్ వ్రణాలపై పరిశోధించి ముందస్తుగా దానిని గుర్తించేలా నివారణ చర్యలు తీసుకునేలా, వైద్య ప్రక్రియను కూడా ఆయన ఆవిష్కరించారు. జైన్ అలనాడు ఐఐటీ కాన్పూర్ విద్యార్థి. ఇప్పటికే ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1972లోనే కాన్పూర్ లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. 1959లో ప్రారంభించిన ఈ అవార్డు నేషనల్ సైన్స్ పౌండేషన్ తరుపున ప్రతి ఏడాది వైట్ హౌస్ అందిస్తుంది. ఇక పాక్ సంతతికి చెందిన హుమయూన్(53) కూడా ఒబామా చేతుల మీదుగా సత్కారం పొందారు.

మరిన్ని వార్తలు