రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా ఇండో అమెరికన్

24 Jun, 2016 22:47 IST|Sakshi
రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా ఇండో అమెరికన్

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా భారత సంతతికి చెందిన సంపత్ శివంగి నియమితులయ్యారు. సంపత్ శివంగిని పార్టీ ప్రతినిధిగా నియమిస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిల్చిన డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చాలారోజులుగా ఇండియన్ అమెరికన్ పొలిటికల్ వింగ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్న సంపత్ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా నియమితుడు కావడం ఇది నాలుగోసారి. 

మొదటిసారిగా 2004లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నియమించగా, 2008లో అప్పటి పార్టీ అధ్యక్ష అభ్యర్థి మెక్‌కెయిన్ రెండోసారి సంపత్‌నే ఎంచుకున్నారు. 2012లో అధ్యక్ష అభ్యర్థిగా నిలబడ్డ మిత్ రోమ్ని కూడా సంపత్‌నే పార్టీ అధికార ప్రతినిధిగా నియమించగా తాజాగా ట్రంప్ కూడా అదే బాటలో నడిచారు. నాలుగోసారి పార్టీ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నట్లు సంపత్ తెలిపారు.

మరిన్ని వార్తలు