అవును.. భారతసైన్యం వచ్చింది: పాక్‌ రక్షణ మంత్రి

29 Sep, 2016 13:30 IST|Sakshi
అవును.. భారతసైన్యం వచ్చింది: పాక్‌ రక్షణ మంత్రి

భారత సైన్యం దాడులను ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. శాంతి కావాలని కోరుకుంటున్న తమ విధానాన్ని తమ బలహీనతగా భావించకూడదని ఆయన అన్నారు. తమ దేశ రక్షణ, భద్రతలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ కూడా తర్వాత స్పందించారు. భారత సైన్యం నియంత్రణ రేఖను ఉల్లంఘించి తమ భూభాగంలోకి వచ్చిందని, తమ సైన్యం కూడా దీనికి తగిన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. తమ సైనికులు ఇద్దరు మరణించారని, తొమ్మిది మందికి గాయాలయ్యాయని కూడా అన్నారు. అయితే.. ఇంతకుముందు తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పేటప్పుడు మంచి ధీమాగా కనిపించిన ఖ్వాజా.. ఇప్పుడు మాత్రం చాలా నీరసంగా కనిపించారు.

పాక్ సైన్యం మాత్రం అసలు భారత సైన్యం దాడులే చేయలేదని అంటోంది. ''సరిహద్దుల వెంబడి జరిగే కాల్పులను భారత సైన్యం సునిశిత దాడులని అబద్ధాలు చెబుతోంది. పాకిస్థాన్ భూభాగం మీద అలాంటి దాడులు జరిగితే.. దానికి తగిన సమాధానం చెబుతాం'' అని పాక్ సైన్యం తెలిపింది.

>
మరిన్ని వార్తలు