దుబాయ్‌లో భారత వ్యాపారి హఠాన్మరణం..

8 Jan, 2020 20:29 IST|Sakshi

దుబాయ్‌ : నూతన సంవత్సరంలో భార్యతో కలిసి విహారయాత్రగా దుబాయ్‌కు వెళ్లిన పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త నేమ్‌చంద్‌ జైన్‌ (61) గుండెపోటుతో తాను బసచేసిన హోటల్‌లోనే మరణించారు. భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మందితో కూడిన జైన్‌ మతస్తులతో నేమ్‌చంద్‌ ఈనెల2న తన భార్యతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. తాము బసచేసిన హోటల్‌లో ఆదివారం స్విమ్మింగ్‌ చేస్తుండగా తీవ్ర అలసటకు లోనైన నేమ్‌చంద్‌ ఆ విషయం భార్యకు చెప్పగా రూంకు వెళ్లి సేదతీరుదామని ఆయనను తీసుకువెళ్లారు. హోటల్‌ మెట్ల వరకూ చేరిన కొద్దిసేపటికే ఆయన కుప్పకూలారు. వైద్య బృందం అక్కడికి చేరుకుని చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన మరణించారని టూర్‌ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు సునీల్‌ జైన్‌ తెలిపారు. బుధవారం తన 62వ పుట్టిన రోజు భారత్‌లో జరుపుకోవాలని రిటన్‌ ఫ్లైట్‌ బుక్‌ చేసుకున్న విమానంలోనే నేమ్‌చంద్‌ భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తమతో పాటు ఉత్సాహంగా దుబాయ్‌లో గడిపేందుకు వచ్చిన జైన్‌ మృతి పట్ల బృందం సభ్యులు తీవ్రంగా కలత చెందారు.

మరిన్ని వార్తలు