దుబాయ్‌ ప్రిన్సెస్‌ కిడ్నాప్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు..

6 Mar, 2020 17:23 IST|Sakshi

న్యూఢిల్లీ : దుబాయ్ పాలకుడు షేక్ మహ‍్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాలని ఆదేశించాడని  బ్రిటన్‌ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తమ ఇద్దరు పిల్లల నిర్బంధంపై పోరాటంలో మహ‍్మద్ మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్ హుస్సేన్ (45), జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి చేసిన ఆరోపణలను లండన్ హైకోర్టులో వారు నిరూపించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా దుబాయ్‌ పాలకుడి కుమార్తె ప్రిన్సెస్‌ లతీఫా కిడ్నాప్‌నకు సంబంధించి భారత్‌లో జరిగిన వ్యవహారాలపై బాధితుల ఆరోపణలతో బ్రిటన్‌ కోర్టు ఏకీభవించింది. రాయ్‌టర్స్‌ కథనం ప్రకారం ..దుబాయ్ పాలకుడి కుమార్తెలలో ఒకరైన ప్రిన్సెస్ లతీఫా దుబాయ్ నుండి తప్పించుకోవడానికి భారీ ప్రణాళిక రచించింది. చివరికి ఆ ప్రణాళిక ఒక సినిమా సన్నివేశాన్ని తలపించింది. (నా భార్యను తిరిగి దుబాయ్‌ పంపించండి)

ప్రిన్సెస్ లతీఫా తన ఫిట్‌నెస్‌ ట్రైనర్, ఫ్రాన్స్‌కు చెందిన టినా జౌహియెనె సూచనతో ఎస్కేప్‌ ఫ్రం దుబాయ్‌ పుస్తక రయిత హార్వ్‌ జుబర్ట్‌ను సంప్రదించి ఈ ప్లాన్‌ను అమలుపరిచింది. 2018  ఫిబ్రవరి 24న లతీఫాను ఆమె డ్రైవర్ దుబాయ్ లోని ఒక కేఫ్ వద్ద వదిలివేసారు, అక్కడ ఆమె మరియు జౌహియెన్ అల్పాహారం కోసం క్రమం తప్పకుండా కలుస్తుంటారు. అక్కడి నుంచి ఈ జంట దుబాయ్ నుండి ఒమన్ మీదుగా మస్కట్‌కు చేరుకునన్నారు. అక్కడి నుంచి వారు భారత్‌లోని గోవాకు బయలుదేరారు. కానీ మార్చి 4 న గోవాలో భారత,  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కమాండో యూనిట్లు వారిని అడ్డగించాయని జౌహియెన్ చెప్పారు. (బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి)

చదవండి : దుబాయ్‌లో భారతీయ విద్యార్థికి కరోనా

"మమ‍్మల్ని భారత కోస్ట్‌గోర్డు దళాలు, హెలికాప్టర్లు, విమానాలు చుట్టుముట్టాయి... పడవ మొత్తం పొగతో నిండిపోయింద’ని అని ఆమె చెప్పుకొచ్చారు. "వారు పడవను దోచుకుని సిబ్బందిని కొట్టారు. లతీఫాను తీవ్రంగా గాయపరిచి ఆమెతో సహా పడవలో అందరినీ కిడ్నాప్ చేసి యుఎఇకి తీసుకువెళ్లార’ని ఆమె చెప్పారు. తాను ఓడకు కెప్టెన్‌గా ఉన్నానని, ఈ దాడికి సాక్ష్యమిచ్చానని జాబర్ట్ చెప్పడం విశేషం. కాగా ఈ విషయాలన్నీ యువరాణి హయా ఈ బ్రిటిష్ న్యాయమూర్తికి వివరించారు. ఇక 35 ఏళ్ళ లతీఫాను దుబాయ్‌ పాలకులు అపహరించేందుకు సాయుధ భారత కమాండో బృందం సముద్రంలో సహకరించిందనే తన ఆరోపణలను కోర్టు సమర్థించినట్టు హయా పేర్కొందని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. కాగా ఈ అంశాలపై వివరణ కోరేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతనిధి రవీష్‌ కుమార్‌ను సంప్రదించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారని రాయ్‌టర్స్‌ తెలిపింది. (ఇదీ లక్‌ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!)

మరిన్ని వార్తలు