ఎయిర్ ఇండియా మ‌రో శుభ‌వార్త‌

7 May, 2020 12:59 IST|Sakshi

టికెట్‌ ధర ప్రయాణికులే భరించాలి

స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రి

న్యూఢిల్లీ/లండన్‌: ఇత‌ర దేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా, బ్రిట‌న్, యూఏఈ స‌హా 12 దేశాల్లో చిక్కుకుపోయిన వారిలో తొలి విడ‌త‌గా 15 వేల మందిని తీసుకురానున్నారు. అందులో భాగంగా అమెరికా నుంచి భార‌త్‌కు తిరిగి రావాల‌నుకుంటున్న వారి కోసం ఎయిర్ ఇండియా నాన్ షెడ్యూల్ క‌మర్షియ‌ల్ విమాన స‌ర్వీసుల‌ను మే 9 నుంచి 15 వ‌ర‌కు న‌డ‌ప‌నుంది. ముఖ్యంగా విద్యార్థులు, గ‌ర్భిణీ మ‌హిళ‌లు, వృద్ధులు, అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి తొలి ప్రాధాన్య‌త ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు ప్ర‌యాణికుల‌ జాబితాను ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా భారతీయ కాన్సులేట్లు రూపొందిస్తున్నాయి. (లాక్‌డౌన్‌: విమానాలు ఎగరబోతున్నాయ్‌!)

వీరు స్వ‌దేశానికి వ‌చ్చే స‌మ‌యంలో అనుస‌రించాల్సిన విధివిధానాల గురించి అమెరికాలోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ముందుగా స్క్రీనింగ్ చేసిన త‌ర్వాతే విమానాల్లో ప్ర‌యాణానికి అనుమ‌తిస్తామ‌ని తెలిపింది. అలాగే వారు భార‌త్‌కు చేరుకున్నాక కూడా ఇక్క‌డి అధికారులు మ‌రోసారి వారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ని పేర్కొంది. అనంత‌రం వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంద‌ని తెలిపింది. టికెట్ చార్జీలు ప్ర‌యాణికుడే భ‌రించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాక భారత్‌కు చేరుకున్న తరువాత ప్రతీ ప్రయాణికుడు త‌ప్ప‌నిస‌రిగా ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లౌడ్ చేసుకుని అందులో వారి వివ‌రాల‌ను రిజిస్టర్‌ చేసుకోవాలని ఆదేశించింది. (64 విమానాల్లో 15 వేల మంది..)

మరిన్ని వార్తలు