కోట్ల లాటరీ.. భారతీయురాలి పంటపండింది

5 Apr, 2017 15:57 IST|Sakshi
కోట్ల లాటరీ.. భారతీయురాలి పంటపండింది

దుబాయి: అబుదాబిలో ఓ భారతీయురాలి పంటపండింది. ఎంతోమంది ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న మిలయనీర్‌ బంపర్‌ లాటరీలో భారీ మొత్తం ఆమె సొంతమైంది. ఏకంగా రూ.17,69,03,813.39 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన రాఫెల్‌ బోనాంజా లాటరీ ఆమెను వరించింది. దాదాపు 50 ప్రయత్నాల తర్వాత ఈ అదృష్టం కలిసొచ్చింది. నిషితా రాధాకృష్ణ పిళ్లై అనే మహిళ అబుదాబిలో రెండేళ్లపాటు ఆమె భర్తతో కలిసి మెడికల్‌ ప్రాక్టీస్‌ చేసింది. ఆమె భర్త ఇప్పటికే 50సార్లు రాఫెల్‌ బొనాంజా బిగ్‌ లక్కీ మిలియనీర్‌ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

దాదాపు 50సార్లు టికెట్‌ కొన్న ఆయన తన భార్య నిషితా పేరిట 058390 నెంబర్‌గల లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో ఈ నెంబర్‌కే ఆ లాటరీ తగిలింది. దీంతో నిషితా, ఆమె భర్త సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన రాధా ప్రస్తుతం టెక్సాస్‌లో భర్తతో కలిసి ఉంటోంది. గత ఏడాది(2016) జూలై నెలలో టెక్సాస్‌లో జెనెటిక్స్‌ విభాగంలో ఫెలోషిప్‌ ప్రోగ్రాం పూర్తి చేసేందుకు వెళ్లింది. అక్కడికి వెళ్లినా వారి లాటరీ ప్రయత్నాలు ఆపకపోవడంతోనే ఈ అదృష్టం దక్కింది. ఇలా రాఫెల్‌ బోనాంజా ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డబ్బు లాటరీ రూపంలో తీసుకెళ్లనున్న రెండో వ్యక్తి ఈమె కానున్నారు.

మరిన్ని వార్తలు