‘ఫ్లాట్‌బ్రెడ్‌ ఉడికిస్తే ఉబ్బిపోతుంది’

13 Jun, 2020 20:46 IST|Sakshi

సాధారణంగా పూరీలు, చపాతీలు తయరుచేసేటప్పుడు పొంగి తాజాగా కనిపిస్తే వెంటనే తినాలనిపిస్తుంది. అంతే కాకుండా కొన్నిసార్లు చపాతీలను పెనం మీద కాల్చినప్పుడు అవి ఒక్కసారిగా ఉబ్బిపోటం చూసి ఆశ్చర్యపోతాం. అచ్చం అలాంటి ఒక వీడియోను ఫుడ్‌ ఇన్‌సైడర్‌ అనే వెబ్‌సైట్‌ తన ట్వీటర్‌ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘భారతీయ ఫ్లాట్‌బ్రెడ్‌ ఉడికించినప్పుడు ఉబ్బిపోతుంది’ అని కామెంట్‌ జతచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విటర్‌లో 248వేల మంది లైక్‌ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ.. సరదాగా మీమ్స్‌ తయారు చేస్తున్నారు.

అయితే ఈ వీడియోలో రెండు రోటీలను మంటపై వేసి కాల్చటంతో అవి ఒక్కసారిగా ఉబ్బిపోతాయి. అయితే వీటిని పుల్కా అంటారని, పుల్కాలు అధికంగా పొంగుతాయని ఫుడ్‌ ఇన్‌సైడర్‌ తెలిపింది. అదే విధంగా రోటీలు, చపాతీలు కూడా తయారు చేసేటప్పుడు ఉబ్బిపోతాయని ‌ తెలిపింది. ఈ పుల్కాలను అధికంగా గ్లూటెన్‌ ఉండే గోధుమ పిండి(అట్టా)తో చేశామని పేర్కొంది. అట్టా ఉపయోగిస్తే పిండి వంట చేసేటప్పుడు రొట్టెలు పగలకుండా ఉంటాయని ఫుడ్‌ ఇన్‌సైడర్‌ పేర్కొంది. దీనితో మెత్తగా రోటీలు పొంగి టేస్టీగా ఉంటాని పేర్కొంది. ‘నీరు తడిగా ఉంటుంది, ఐస్‌క్రీం చల్లగా ఉంటుంది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. అదే విధంగా మేము చపాతీలు చేసినప్పుడు ఇలా పొంగవు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు