పర్మనెంట్ వీసా తిరస్కరించారని..

19 Jul, 2016 21:18 IST|Sakshi
పర్మనెంట్ వీసా తిరస్కరించారని..

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా మెల్బోర్న్ ప్రాంతంలో ఓ భారతీయ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం చేసిన తన ధరఖాస్తును అధికారులు నిరాకరించడంతో అతడు ప్రాణాలు తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 36 ఏళ్ళ దీపక్ సింగ్ 2008 లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ వెల్ఫేర్ కోర్సు చదివేందుకు వెళ్ళాడు. చదువుకునే సమయంలోఅతడు అక్కడ ఉద్యోగం చేసినట్లుగా రుజువులు దొరకండం అతడ్ని శాస్వత నివాసానికి అర్హత లేకుండా చేసింది. అనంతరం అక్కడే ఓ ఆస్ట్రేలియన్ మహిళను సింగ్ వివాహమాడాడు. టెంపరరీ వీసాతో కొనసాగుతూ... అక్కడి పౌరురాలిని వివాహమాడిన ఆధారంతో పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) వీసాకోసం ధరఖాస్తు చేసుకున్నాడు.

పని హక్కులను తొలగించడంతోపాటు.. భారత్ కు తిరిగి వెళ్ళాల్సిందిగా  సింగ్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశించడంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అతడి స్నేహితుడు, సంఘం సభ్యుడైన జస్వీందర్ సిద్ధు తెలిపినట్లు ఓ వెబ్ సైట్ వివరాల్లో వెల్లడించింది. ఆస్ట్రేలియా పౌరురాలిని పెళ్ళాడిన సింగ్.. స్పౌస్ వీసా ఆధారంగా  పర్మనెంట్ రెసిడెన్సీ వీసాకు ధరఖాస్తు చేసుకున్నాడని, అయితే అది రావడం ఎంతో కష్టం అని తేలడంతో సింగ్ తీవ్ర నిరాశకు, ఒత్తిడికి లోనయ్యాడని సిద్ధు తెలిపాడు. 2012 లోనే ఓసారి అతని ధరఖాస్తును తిరస్కరించడంతో అప్పట్నుంచీ అతడు పీఆర్ వీసాకోసం తీవ్రంగా పోరాడుతున్నాడని, ఇమ్మిగ్రేషన్ నిరాకరణపై కోర్టును ఆశ్రయించిన సింగ్.... పోరాటం చివరిస్థాయిలో ఉండగా.. కోర్టుకు హాజరు కావాల్సిన అతడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపాడు. ప్రతిరోజులాగే ఆదివారం కూడా అతడు నిద్రలేచి  కనీసం ఏమీ తినకుండా ఆఫీసుకు బయల్దేరాడని, ఇంటినుంచీ వెళ్ళిన కేవలం అరగంట లోపే పోలీసులు అతడు కారులో చనిపోయినట్లుగా సమాచారం అదించినట్లు సిద్ధూ తెలిపాడు.

మరిన్ని వార్తలు