హెచ్‌–1బీ ‘తగ్గింపు’పై వ్యాజ్యం

17 Oct, 2018 01:11 IST|Sakshi

ఫెడరల్‌ కోర్టులో దాఖలుచేసిన ఐటీ సర్వ్‌ అలయన్జ్‌

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసా కాలపరిమితిని మూడేళ్ల కన్నా తక్కువకు కుదించడంపై అమెరికా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వేయికి పైగా ఇండో–అమెరికన్ల నేతృత్వంలోని కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ సర్వ్‌ అలయన్జ్‌ అనే సంస్థ అమెరికా వలస సేవల సంస్థ యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌)కి వ్యతిరేకంగా ఈ దావా వేసింది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధికే హెచ్‌–1బీ వీసాలను మంజూరుచేసే ప్రక్రియను ఇమిగ్రేషన్‌ ఏజెన్సీ ఇటీవల చేపట్టిందని ఐటీ సర్వ్‌ అలయన్జ్‌ పేర్కొంది.

ఇలా జారీ అవుతున్న వీసాల కాల పరిమితి చాలా తక్కువగా ఉంటోందని, కొన్నిసార్లు 45, 60 రోజుల పరిమితితో కూడా వీసాలు జారీ అవుతున్నాయని తెలిపింది. నిబంధనల్ని తప్పుగా అన్వయించి, వీసా గడువును తగ్గించే అధికారం ఇమిగ్రేషన్‌ ఏజెన్సీకి లేదని తెలిపింది. మూడేళ్ల కాలానికి వీసాల్ని మంజూరుచేసే అధికారాన్ని అమెరికా పార్లమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌కు కట్టబెట్టిన సంగతిని గుర్తుచేసింది.

‘ఇమిగ్రేషన్‌ విభాగం ఇష్టారీతిలో నిబంధనలు రూపొందిస్తోంది. తప్పుల్ని సరిచేసి చట్టాల్ని సరిగా పాటించేలా ఇమిగ్రేషన్‌ విభాగంలో పారదర్శకత పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక ఫెడరల్‌ కోర్టులోనే తేల్చుకుంటాం’ అని ఐటీ సర్వీస్‌ అలయన్జ్‌ అధ్యక్షుడు గోపి కందుకూరి అన్నారు. తరచూ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటం పట్ల విసిగిపోయామని తెలిపారు. అమెరికా ఇమిగ్రేషన్‌ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఐటీ సర్వీస్‌ అలయన్జ్‌ దావా వేయడం ఇది రెండోసారి.

మొదటి వ్యాజ్యాన్ని ఈ ఏడాది జూలైలో దాఖలుచేసింది. నాన్‌–ఇమిగ్రంట్‌ వీసా అయిన హెచ్‌–1బీ వీసాలను విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు గాను అమెరికా కంపెనీలకు 3–6 సంవత్సరాల కాలపరిమితికి జారీచేస్తారు.  ఈ వీసా పొందిన ఉద్యోగి అమెరికాలో కనీసం మూడేళ్ల వరకు నివసించొచ్చు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌