దుబాయ్‌లో భారతీయుడికి రూ.21కోట్ల లాటరీ

8 Apr, 2018 04:07 IST|Sakshi

దుబాయ్‌: భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో జాక్‌  పాట్‌ కొట్టాడు. అబుదాబీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో మంగళ వారం జరిగిన బిగ్‌ టికెట్‌ లాటరీలో ఏకంగా రూ.21.2 కోట్లు(12 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్నాడు. కేర ళకు చెందిన జాన్‌ వర్గీస్‌ ఇక్కడ ఓ ప్రైవేట్‌ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

లాటరీ గెలిచినట్లు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఎవరైనా తనని ఏప్రిల్‌ ఫూల్‌ చేయడానికి కాల్‌చేసి ఉంటారని భావించా నని జాన్‌ చెప్పారు. డబ్బుతో తొలుత స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కుంటానని తెలిపాడు. తర్వాత కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మిగతా మొత్తాన్ని పేదవారికి కేటాయిస్తానని చెప్పాడు.  

మరిన్ని వార్తలు