ఇంగ్లాండ్‌లో ఉన్న భారతీయులకు శుభవార్త!

30 Apr, 2020 19:43 IST|Sakshi

లండన్‌: కరోనా నేపథ్యంలో యునైటెడ్‌కింగ్‌డమ్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరూ తమ పేర్లను నమోదు చేయించుకోవల్సిందిగా లండన్‌లో ఉన్న భారత హైకమిషనర్‌ సూచించింది. ఈ మేరకు ట్వీట్టర్‌లో దీనికి సంబంధిన వివరాలను ఉంచింది. భారత పౌరులందరూ https://forms.gle/nnWCw2arfpNxguhM7 లేదా http://hcilondon.gov.in ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని భారత హైకమిషన్‌ తెలిపింది. 

కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో చైనా, ఇటలీ, ఇరాన్‌లో ఉన్న కొంతమంది భారతీయులను భారత ప్రభుత్వం మన దేశానికి తీసుకు వచ్చింది. అయితే కొంత మంది భారతపౌరులు మాత్రం కరోనా నేపథ్యంలో ఆంక్షలు విధించడంతో లండన్‌లోనే చిక్కుకుపోయారు. అయితే దీనికి సంబంధించి ఏప్రిల్‌ 7 వతేదీన యూకేలో చిక్కుకున్న భారతీయులందరిని వెంటనే భారత్‌కి తీసుకురావాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు దీనికి భారతప్రభుత్వం సమాధానం ఇస్తూ యూకే పౌరులను కొంతమందిని వారి దేశానికి ప్రత్యేక విమానాల ద్వారా పంపిస్తున్నామని ఇంగ్లాండ్‌ నుంచి మనదేశానికి రావాలనుకునే వారు ఆ విమానాల ద్వారా రావచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారతహైకమిషన​ భారత పౌరుల వివరాలు నమోదు చేసుకోమని సూచించింది.  

చదవండి:  యాప్ ద్వారా భారత్ను టార్గెట్ చేస్తున్న పాక్!

మరిన్ని వార్తలు