లండన్‌లో భారత సంతతి వైద్యుడి మృతి

29 May, 2020 15:39 IST|Sakshi
రాజేష్‌ గుప్తా (ఫైల్‌ ఫోటో)

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి  కరోనా  పై నిరంతరం యుద్దం చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ల కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ కరోనా పేషంట్లే తమ వాళ్లు అనుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ పోరాటంలో ఎందరో వైద్యులు తమ ప్రాణాలను కూడా విడిచారు. తాజాగా లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న రాజేష్‌ గుప్తా అనే భారత సంతతి వ్యక్తి హోటల్‌లో మృతి చెందారు. కొంతకాలంగా కరోనా సేవలకు అంకితమైన డాక్టర్‌ రాజేష్‌ గుప్తా తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఒక హోటల్‌లో నివాసముంటున్నారు. కాగా ఆయన మృతి వెనుక గల కారణాలు తెలియలేదని అతనితో పాటు పనిచేసే వైద్యులు పేర్కొన్నారు.
(క‌రోనా టెస్టింగ్‌ కిట్‌ను న‌మిలేసిన కోతి)

జమ్మూ యునివర్సిటీలో 1997లో మెడిసిన్‌ కంప్లీట్‌ చేసిన రాజేష్‌ 2006లో లండన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనస్థీషియా విభాగంలో మెడిసిన్‌ అండ్‌ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లండన్‌లోని ఫ్రిమ్లీ హెల్త్ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్ ట్రస్ట్‌ సభ్యులు రాజేష్‌ గుప్తా మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ' రాజేష్‌ గుప్తా.. లండన్‌లోని వెక్స్‌హామ్‌ పార్క్‌ ఆసుపత్రిలో మెడికల్‌ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేందుకు తన ఫ్యామిలీకి దూరంగా తన కొలీగ్స్‌తో కలిసి హోటల్‌లో నివాసముంటున్నారు. రోజు హోటల్‌ నుంచే ఆసుపత్రికి వస్తూ తన విధులు నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం హోటల్‌ రూంలో రాజేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా రాజేష్‌ మృతి వెనుక కారణం ఏంటో మాకు తెలియదంటూ' ట్రస్ట్‌ పేర్కొంది.

రాజేష్‌ గుప్తా వైద్యుడిగానే గాక మిగతా యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా ఉండేవాడని.. ముఖ్యంగా పెయింటింగ్‌‌, ఫోటోగ్రఫీ, కుకింగ్‌లో తన ప్రాభవాన్ని చూపించేవాడు. జాలి, దయ గుణం కలిగిన రాజేష్‌ ఎందరో పేద వాళ్లకు తనవంతుగా సాయం చేసేవాడని ట్రస్ట్‌ తెలిపింది. స్వతహాగా మంచి రైటర్‌ అయిన రాజేష్‌ గుప్తా చాలా పుస్తకాలు రాసేవారని, వాటిని పలు పబ్లికేషన్స్‌కు అందించేవారని తెలిపారు. 

మరిన్ని వార్తలు