దారుణం: కరోనా కరోనా అంటూ విచక్షణారహితంగా..!

17 Mar, 2020 19:39 IST|Sakshi

జెరూసలేం: సర్వత్రా కరోనా వైరస్‌ భయం ఆవహిస్తోంది. ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు కరోనా వైరస్ పేరుతో కంగారు పడుతున్నారు. జన జీవనం స్తంభించి పోతున్నది. ఈ సమయంలో  కరోనా పాజిటివ్ అని తేలినా కొందరు వైద్యం చేయించుకోకుండా ప్రజల్లో తిరుగుతున్నారని పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి ఆసుపత్రికి లాక్కెళ్తున్నారు. తుమ్మినా, దగ్గినా అతన్ని శత్రువులా చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు వచ్చిన భారత సంతతికి చెందిన 28ఏళ్ల ఏమ్ షాలేమ్ సింగ్సన్ అనే యూదుడిని చైనా పౌరుడిగా పొరబడి అక్కడి వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చదవండి: మరో 250  మంది భారతీయులకు కరోనా 

టైబీరియస్ నగరంలో శనివారం ఇద్దరు స్థానికులు.. కరోనా కరోనా అని అరుస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. మీవల్లే కరోనా వచ్చిందని అతనిపై విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ దాడిలో సింగ్సన్‌కు ఛాతిపై తీవ్ర గాయాలు కాగా అతడు ప్రస్తుతం స్థానికంగా ఉన్న పొరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని షావేయీ ఇజ్రాయెల్ వెల్లడించింది. ఛాతిపై, ఊపిరితిత్తులపై గాయాలయ్యాయని తెలిపారు. తాము చైనీయులం కాదని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. సింప్సన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి మాలాట్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. మూడేళ్ల క్రితమే భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 304 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చదవండి: భారత్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు! 

మరిన్ని వార్తలు