సైన్యాన్ని మోసగించబోయాడు

9 Jul, 2017 19:45 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికా సైన్యంలో చేరడానికి తప్పుడు సమాచారం ఇచ్చిన భారత సంతతికి చెందిన ముస్లిం వ్యక్తి అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థ ఐసిస్‌కు మద్దతు పలకడంతో పాటు, దానిలో చేరడానికి ఆన్‌లైన్‌లో మార్గాలు వెతికాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతడికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించే వీలుంది. వర్జీనియాలో నివసిస్తున్న 27 ఏళ్ల శివం పటేల్‌ ఏడేళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించాడు.

అమెరికా సైన్యంలో ఉద్యోగం కోసం పంపిన దరఖాస్తులో 2011–12లో కుటుంబంతో సహా భారత్‌లో పర్యటించడం మినహా ఏడేళ్లుగా అమెరికా దాటి వెళ్లలేదని పటేల్‌ పేర్కొన్నట్లు కోర్టు అఫిడవిట్‌ను ఉటంకిస్తూ ‘వర్జీనియా పైలట్‌’ పత్రిక తెలిపింది. పటేల్‌ గది, కంప్యూటర్‌ను పరిశీలిస్తే అతడు ఐసిస్‌ మేగజీన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆ సంస్థలో చేరడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు