రెండు కొక్కేలతో రక్తకణాలకు అతుక్కుంటుంది!

11 Jan, 2014 06:03 IST|Sakshi
రెండు కొక్కేలతో రక్తకణాలకు అతుక్కుంటుంది!

మలేరియా పరాన్నజీవి గుట్టువిప్పిన భారత సంతతి శాస్త్రవేత్త  
 వాషింగ్టన్: దోమకాటు వల్ల మనిషిలోకి ప్రవేశించి క్రమంగా ఎర్ర రక్తకణాలను తినేస్తూ.. ప్రాణాలు హరించే మలేరియా వ్యాధికారక ప్లాస్మోడియం వైవాక్స్ పరాన్నజీవి గుట్టును భారత సంతతి శాస్త్రవేత్త నీరజ్ తోలియా విప్పారు. భారత్‌లోని ప్లాస్మోడియం జాతుల్లో అతి ప్రమాదకరమైన వైవాక్స్ పరాన్నజీవి మనిషి ఎర్ర రక్తకణాలకు రెండు ప్రొటీన్ కొక్కేలతో అతుక్కుంటుందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నీరజ్ కనుగొన్నారు. ఎర్ర రక్తకణంపై ఉండే రెండు ప్రొటీన్లను, తనలోని రెండు ప్రొటీన్లను ఉపయోగించి అది రెండు దశల ప్రక్రియ ద్వారా కొక్కేలను తయారు చేసుకుంటుందని ఆయన తేల్చారు. దీంతో మనిషి ఎర్ర రక్తకణాలపై ఆ ప్రొటీన్లను తొలగించేందుకు లేదా ప్లాస్మోడియం ప్రొటీన్లను నివారించేందుకు కొత్త టీకాలు, మందులు కనుగొంటే.. ఈ పరాన్నజీవిని నిర్మూలించొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు