అంతర్జాతీయ శాంతి బహుమతికి నేహా నామినేట్

26 Sep, 2014 12:02 IST|Sakshi
అంతర్జాతీయ శాంతి బహుమతికి నేహా నామినేట్

ది హేగ్:  అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి -2014కి భారతీయ సంతతికి చెందిన నేహా అనే టీనేజీ బాలిక యూఎస్ నుంచి నామినేట్ అయింది. ఆమెతో పాటు రష్యా నుంచి అలెక్స్, ఘనా నుంచి అండ్రూలు కూడా నామినేట్ అయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. చిన్నారులకు హక్కులను కాపాడటంలో చురుకైన పాత్ర పోషించే టీజేజీ బాలికలకు ఈ అవార్డును అందజేస్తారని తెలిపింది.

18 ఏళ్ల నేహా యూఎస్లో సొంతంగా ఓ ఫౌండేషన్ స్థాపించి... దీని ద్వారా చిన్నారుల హక్కులపై చైతన్యం కలిగిస్తుందని పేర్కొంది. అలాగే 17 ఏళ్ల అలెక్స్... హోమో సెక్య్సువల్, ట్రాన్స్జెండర్పై రష్యాలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. 13 ఏళ్ల అండ్రూ దేశంలో కరువుపై పోరాడుతూ... ఫుడ్ ఎయిడ్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారని వెల్లడించింది. 2005 నుంచి అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఈ అవార్డు విజేత పేరును నవంబర్ 18న ది హేగ్లో ప్రకటిస్తారని మీడియా తెలిపింది.

మరిన్ని వార్తలు