సూడాన్‌ పేలుడు : పలువురు భారతీయులు సజీవదహనం​

4 Dec, 2019 17:58 IST|Sakshi

సూడాన్ దేశంలోని  బహ్రీ  పట్టణంలో సంభవించిన భారీ పేలుడు 18 మంది భారతీయులను పొట్టన బెట్టుకుంది. కోబర్ నైబర్‌హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలోమంగళవారం ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడంతో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 23 మంది సజీవ దహనమయ్యారు. మరో 330 మందికిపైగా తీవ్రంగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదనీ కానీ 18 మంది చనిపోయినట్టుగా తెలుస్తోందని భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మృతదేహాలు కాలిపోవడం వలన గుర్తింపు సాధ్యం కావడం లేదని వెల్లడించింది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రమాదంనుంచి బయటపడిన దాదాపు 34 మంది భారతీయులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపింది. సెరామిక్స్ ఫ్యాక్టరీలో అవసరమైన భద్రతా పరికరాలు లేవని, నిల్వ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫ్యలం కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రభుత్వం తెలిపింది, దర్యాప్తు మొదలైందని వెల్లడించింది.

మరోవైపు ఈ సంఘటనలో 23 మంది మృతి చెందారని, 130 మందికి పైగా గాయపడ్డారని సుడాన్ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ నివేదిక పేర్కొంది. కాగా ప్రమాదం తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు