బ్రిటన్‌కు వలసల్లో పడిపోయిన భారత్‌ స్థానం

25 May, 2018 03:46 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లో ఉండే విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు నాలుగో స్థానంలో నిలిచారు. అయితే, ఈ విషయంలో 2016లో భారత్‌ రెండో స్థానం ఆక్రమించగా 2017 లెక్కల ప్రకారం నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్‌ వలసలపై జాతీయ గణాంకాల కార్యాలయం(ఓఎన్‌ఎస్‌) తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం పోలండ్‌(10 లక్షలు) ప్రథమ స్థానంలో,  రుమేనియా(4.11 లక్షలు), రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ (3.50 లక్షలు), భారత్‌(3.46 లక్షలు) నాలుగో స్థానంలో ఉంది. యూరోపియనేతర దేశాలతో పోలిస్తే వలసల్లో భారతీయులదే ప్రథమ స్థానం, ఆ తర్వాత పాకిస్తాన్‌(1.88లక్షలు) నిలుస్తోంది. అయితే, పర్యాటక వీసాపై బ్రిటన్‌కు వెళ్లే వారిలో అత్యధికులు భారతీయులు కాగా రష్యా, పాకిస్తాన్, చైనా దేశీయులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వలస జనాభా పెరుగుదల రీత్యా చూస్తే రుమేనియా మొదటి స్థానంలో ఉందని ఓఎన్‌ఎస్‌ అధికారి నికోలా వైట్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు