బద్దలైన అగ్నిపర్వతం: ఏడుగురి మృతి

22 May, 2016 17:55 IST|Sakshi

ఇండోనేషియా: ఇండోనేషియాలోని గాంబెర్‌లో ఆదివారం సినాబంగ్‌ అనే అగ్నిపర్వతం బద్దలైంది. దీని ప్రభావంతో సమీప ప్రాంతాల్లో సేద్యం చేసుకుంటున్న ఏడుగురు దుర్మరణం చెందారు. అగ్నిపర్వతం నుంచి భారీ స్థాయిలో లావా వెలువబడుతోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన తీవ్రమైన వేడి, విషవాయువులతో కూడిన బూడిద పెద్ద ఎత్తునా ఆకాశంలోకి చిమ్మతూ మూడు కిలోమీట్లరకు పైగా ఆవరించింది. గాంబెర్‌లోని సమీప నివాస గృహాలపైనా, వాహనాలపైనా బూడిద విస్తరించింది.

అగ్నిపర్వతం విస్పోటనం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని చిక్కుకున్న వేలమంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 400 సంవత్సరాల పాటు నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా విజృంభించింది. గత 2010, 2014 సంవత్సరాలలో సినాబంగ్‌ అగ్నిపర్వతం విస్ఫోటనం ధాటికి 12 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా, ఇండోనేషియా చుట్టూ 120 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఆవరించి ఉన్నాయి.

మరిన్ని వార్తలు