నడిసముద్రంలో 49 రోజులు

25 Sep, 2018 04:56 IST|Sakshi
పసిఫిక్‌ మహాసముద్రంలో చెక్కఇంటిపడవలో అడిలాంగ్‌

జకార్తా: సముద్రం మధ్యలో చెక్క ఇంట్లో పనిచేస్తున్న టీనేజీ పిల్లాడు అడిలాంగ్‌ చెక్కఇంటితోసహా సముద్రంలోకి అలలధాటికి 2,500 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాడు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎట్టకేలకు 49 రోజుల తర్వాత ఆ పిల్లాడిని రక్షించగలిగారు. ఇండోనేసియాలోని సులవెసి ద్వీపం దగ్గర్లో జరిగిందీ ఘటన. ఒక్కడే నడిసముద్రంలో 49 రోజులున్న అడిలాంగ్‌ ఆకలితీర్చుకునేందుకు చేపలు వేటాడి తిన్నాడు.

దాహమేస్తే సముద్రపునీటిలో బట్టలు తడిపి పిండి తాగేవాడు. అటుగా వెళ్తున్న పనామా దేశానికి చెందిన ఓ పడవ బృందం ఇతడిని కాపాడింది. ఇన్ని రోజులైనా పిల్లాడు ఆరోగ్యంగానే ఉండటం విశేషం. సముద్రంలో చేపలను వెలుతురుతో ఆకర్షించేందుకు నీటిలో తేలియాడే ఇళ్లను నిర్మిస్తారు. సముద్రం అడుగుభాగంలో వేసిన లంగరు ఆధారంగా ఇల్లు నీటిపై ఒకేచోట ఉంటుంది. వెలుతురు నిరంతరంగా ఉండే బాధ్యత యజమాని ఈ పిల్లాడికి అప్పజెప్పాడు.   
 

మరిన్ని వార్తలు