ఛీ.. ఛీ.. వాక్‌.. సబ్బును టేస్ట్‌ చేస్తారా?

17 Feb, 2019 06:32 IST|Sakshi

సబ్బు.. టెస్ట్‌ చేయాలంటే శరీరానికి రుద్దుకోవాలి.. మరి టేస్ట్‌ చేయాలంటే.. ఛీ.. ఛీ.. వాక్‌.. సబ్బును టేస్ట్‌ చేస్తారా ఎవరైనా! అనే కదా మీకు అనిపిస్తుంది. కానీ ఈ ఫొటోలో ఉన్నామె కాస్త డిఫరెంట్‌. సబ్బును టేస్ట్‌ చేస్తాను అంటూ ముందుకొస్తోంది. ఇండోనేసియాలోని తూర్పు జావాకు చెందిన ఖోసిక్‌ అసీఫాకు ఓ వింత రకమైన అలవాటు ఉంది. సబ్బులు ఎలా ఉన్నాయో టేస్ట్‌ చేసి మరీ వాటికి రేటింగ్‌ ఇస్తుందట. రెండేళ్ల కిందట ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరిక పుట్టిందట. దీంతో ఆమె సబ్బులను ఇలా రుచి చూడటం ప్రారంభించిందట. రుచి చూడటమంటే ఏదో అలా నాలుక చివర అంటించుకుని మమ అనిపించేయడం కాదు.. చక్కగా ఐస్‌క్రీం మాదిరిగా రుచి చూసి మరీ రేటింగ్‌ ఇస్తుందట. అంతేకాదు ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్‌ చేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈమెకు ఫాలోవర్లు పెరిగిపోయారు. వేలాది లైకులు.. కామెంట్లు వస్తున్నాయి కూడా. అంతేకాదు ఆ తర్వాత ఏ సబ్బును రుచి చూడాలో వాటి బ్రాండ్‌ పేరును సూచిస్తున్నారు ఫాలోవర్లు. ఎప్పుడు.. ఎవరు.. ఎలా ఫేమస్‌ అయిపోతారో అస్సలే అర్థం కావట్లేదు..!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు